Google Messages అనేది మెసేజ్‌లను పంపే వీలు కల్పించే అధికారిక Google యాప్. Google Messages, వంద కోట్ల యూజర్లు కనెక్ట్ అయ్యే విధానంలో విప్లవాన్ని తీసుకొస్తోంది, SMS, MMSను రీప్లేస్ చేసే ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్స్టింగ్ అయిన ఉత్తమ కమ్యూనికేషన్ సర్వీసులు (RCS) దీనిని అందిస్తున్నాయి. RCSతో, మీరు అధిక రిజల్యూషన్ గల ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు, డైనమిక్ గ్రూప్ చాట్లను ఆస్వాదించవచ్చు, మీ iPhone ఫ్రెండ్స్‌తో సహా ఇతర RCS యూజర్లతో సులభంగా కనెక్ట్ కావచ్చు.  
        •        ఉత్తమ కమ్యూనికేషన్: అధిక క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలను షేర్ చేయండి, ఫ్రెండ్స్ టైప్ చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మీ iPhone ఫ్రెండ్స్‌తో సహా, ఇతరులతో డైనమిక్ గ్రూప్ చాట్లను ఆస్వాదించండి.
        •        ప్రత్యేక మెరుగులు: అనుకూల చాట్ బబుల్ రంగులు లేదా సరదా అయిన సెల్ఫీ GIFల వంటి ఫీచర్లతో సంభాషణలను ప్రత్యేకించి మీ స్టయిల్లోకి మార్చుకోండి. 
        •        అనివార్య గోప్యత: Google Messagesను ఉపయోగించే యూజర్ల మధ్య పూర్తి స్థాయి ఎన్క్రిప్షన్తో మీ వ్యక్తిగత చాట్లు సురక్షితంగా ఉన్నాయనే ధీమాతో నిశ్చింతగా ఉండండి, కాబట్టి మీరు మెసేజ్ చేసిన వ్యక్తి తప్ప, ఎవరూ (Google, థర్డ్-పార్టీలతో సహా) మీ మెసేజ్‌లను, అటాచ్మెంట్లను చదవలేరు లేదా చూడలేరు. అదనంగా, అడ్వాన్స్డ్ స్పామ్ రక్షణను ఆస్వాదించండి. 
        •        AI-అందించిన మెసేజింగ్: Magic Compose సూచనలతో, మా తాజా AI ఫీచర్లతో అద్భుతమైన మెసేజ్‌ను క్రియేట్ చేయండి.
        •        పరికరాలన్నింటిలో సులభంగా ఉపయోగించవచ్చు: మీ ఫోన్లో చాట్‌ను ప్రారంభించి, దానిని మీ టాబ్లెట్ లేదా కంప్యూటర్లో సులభంగా కొనసాగించండి. యాప్ Wear OSలో కూడా అందుబాటులో ఉంది.
Google Messages అనేది కేవలం ఒక సాధారణ మెసేజింగ్ యాప్ కాదు; ఇది ఉత్తమమైనది, సురక్షితమైనది, అలాగే దీనితో మీ భావాలను మరింత బాగా వ్యక్తపరిచి కనెక్ట్ కావచ్చు.
యాప్ Wear OSలో కూడా అందుబాటులో ఉంది. RCS లభ్యత ప్రాంతం, క్యారియర్ ఆధారంగా మారుతుంది, దీనికి డేటా ప్లాన్ కూడా అవసరం కావచ్చు. ఫీచర్ల లభ్యత మార్కెట్, పరికరం ఆధారంగా మారుతుంది, వీటి కోసం బీటా టెస్టింగ్‌కు కూడా సైన్ అప్ చేయాల్సి రావచ్చు.
అప్డేట్ అయినది
21 అక్టో, 2025